22 July, 2026 | 1:58 AM

‘సర్’ను వంద శాతం పూర్తి చేయాలి

22-07-2026 01:16 AM

అదనపు కలెక్టర్ హరిసింగ్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 21: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(సర్)కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పా రదర్శకంగా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్,తుంగతుర్తి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ)హరిసింగ్ ఆదేశించారు.మంగళవారం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాల యంలో మండలంలోని అన్ని స్థాయిల బీఎల్వోలు,సూపర్వైజర్లతో సర్ పై ప్రత్యేక స మావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని,అనర్హుల పేర్లు తొలగించాలని స్పష్టం చేశారు.ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆగస్టు 3వరకు వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కోరారు.

అనంతరం మండలంలో వంద శాతం సర్ ప్రక్రియను పూర్తి చేసిన జాజిరెడ్డిగూడెం 118,119 పోలింగ్ స్టేషన్ బీఎల్‌ఓలు,వేల్పుచర్ల 131 పోలింగ్ స్టేషన్ బీఎల్‌ఓ సైదమ్మ,నాగమ్మ ధనలక్ష్మిలను శాలువాలతో సన్మానించారు.ఈ కార్య క్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, డీటీ అశ్విని,ఆర్‌ఐ వెంకటరెడ్డి,వివిధ గ్రామా ల బీఎల్వోలు,సూపర్వైజర్లు,రెవెన్యూ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.