2 June, 2026 | 2:58 AM

బాధితుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే

01-06-2026 07:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పోలీస్ శాఖ ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించి బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆస్తు తగాదాలు ఇతర సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం మార్గం చూపిస్తామని ప్రజలు నిర్ణయంగా పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు.