2 June, 2026 | 2:13 AM

ఎండిఓ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో విచారణ

01-06-2026 07:12 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): రెండు రోజుల క్రితం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఇద్దరి ఉద్యోగుల మధ్య గొడవపై సోమవారం జిల్లా అధికారులు విచారణ జరిపారు. గరిడేపల్లి లోని మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి  జరిగిన సంఘటనపై కార్యాలయంలోని సిబ్బందిని, ఇతరులను విచారించి వివరాలను సేకరించారు.

కార్యాలయం ఆవరణలో సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి పై చేయి చేసుకునే విషయంపై, సర్వీస్ బుక్ లో వివరాలను నమోదు చేయలేదనే అంశంపై ఆమె విచారం నిర్వహించినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ... సంఘటనపై పూర్తి వివరాలు సాక్షాలను సేకరించామని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు అందచేస్తామని ఆమె తెలిపారు. ఆమె వెంట గరిడేపల్లి ఎంపీడీవో సరోజ తదితరులు ఉన్నారు.