2 June, 2026 | 2:14 AM

ధ్వన్యనుకరణ విద్యపై పుస్తకాన్ని ఆవిష్కరించిన హాస్యనటుడు జానీ లివర్

01-06-2026 07:07 PM

మంథని,(విజయక్రాంతి): ముంబై ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, శిక్షకుడు రాజ్ కుమార్ రచించిన ధ్వన్యనుకరణ శాస్త్రం పుస్తకాన్ని బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు జానీ లివర్ ముంబైలో ఆవిష్కరించారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానీ లివర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానీ లివర్ మాట్లాడుతూ... మిమిక్రీ కళను శాస్త్రీయంగా పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.

ప్రతి కళాకారుడు తన కళా ప్రయాణంలో నిరంతరం శ్రమించాలని, ప్రేక్షకులకు ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని అందించినప్పుడే కళాకారుడికి గుర్తింపు లభిస్తుందని ఆయన సూచించారు. ఠాకూర్ ఎడ్యుకేషన్ అకాడమీలో జరిగిన ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖ మిమిక్రీ కళాకారులు, సాహితీప్రియులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 పూర్వ చైర్మన్  జి.వి.ఎన్. రాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, విజయవంతంగా నిర్వహించారు.