గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్ట్‌కు లైన్‌క్లియర్
- పనులకు 13వేల కోట్లు
- ఐదేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ, జూన్ 9: గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు జారీ చేసింది. రూ. 13వేల కోట్లతో పౌర-సైనిక విమానాశ్రయాన్ని ఇక్కడ నిర్మించనుంది. ఐఎన్‌ఎస్ బాజ్ వద్ద ఇప్పటికే ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. ఈ విమానాశ్రయం గ్రేట్ నికోబార్ ఆగ్నేయ తీరంలో గల గలథియా బే సమీపంలోని చింగెన్లో ఏర్పాటు కానుం ది. దీన్ని పౌర, సైనిక అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
హిందూ మహాసము ద్రం, దక్షిణ చైనా సముద్రాన్ని కలిపే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధి పశ్చి మ మార్గాలకు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని వ్యూహాత్మకంగా భారత ప్రభు త్వం ఎంపిక చేసింది. ఐదేళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. హిందూ మహాసముద్రంలో సముద్ర కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ద్వీపం ఒక కీలకమైన కేంద్రంగా ఉంది.
ఈ కీలక వాణిజ్య మార్గంలో జరిగే పరిణామాలను పర్యవేక్షించడానికి, వాటిపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందించే సామర్థ్యాన్ని ఈ విమానాశ్రయం బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అంటున్నారు. మలక్కా జలసంధికి ఈ ఎయిర్‌పోర్ట్ అతి సమీపంలో ఉండటం, జలసంధికి సమీపంలోని యుద్ధనౌకలు, వైమానిక సదుపాయా లు నిఘాలో కీలకం కానున్నాయి. చైనాకు చెందిన 80 శాతం చమురు, 70 శాతం సహజవాయువు కూడా మలక్కా మీదుగానే రవాణా అవుతుంది.






