21 March, 2026 | 12:55 AM

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

20-03-2026 12:00 AM

మఠంపల్లి, మార్చి 19 : మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రములో గురువారం తెలు గు సంవత్సరాది అనగా ఉగాది పరాభవ నామ  సంవత్సరంను పురస్కరించుకొని  శ్రీ స్వామివారికి ప్రాతః కాలం ప్రత్యేక పూజ లు, అభిషేకములు, విశేష అర్చనలు దేవాలయ అర్చకులచే  నిర్వహించబడినది.

సాయం త్రం 5 గంటల నుండి పంచాంగ శ్రవణము కార్యక్రమం అత్యంత వైభవముగా నిర్వహించబడినది.తదుపరి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు,అర్చకులు సిబ్బంది  భక్తులు పాల్గొన్నారు.