13 April, 2026 | 5:02 PM

ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు

13-04-2026 03:13 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డా. శ్రీధర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో కళాశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఆయన మృతికి సంతాపంగా మెడికల్ కళాశాలలో సోమవారం సంతాప సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, జూనియర్ డాక్టర్లు  డా. శ్రీధర్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. సుబోధ్ మాట్లాడుతూ.... ఆయన వైద్య రంగంలో చేసిన సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. విద్యార్థులకు మంచి మార్గదర్శకుడిగా ఉండి వైద్య సేవల్లో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల మౌనం పాటించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.