13 April, 2026 | 4:40 PM

1వ వార్డులో డ్రైనేజీ క్లీనింగ్ పనులను పరిశీలించిన చైర్మన్, కమీషనర్

13-04-2026 03:10 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లిలోని ఒకటో వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ క్లినింగ్ పనులను సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రిహానా కమల్ పాషా, మున్సిపల్ కమిషనర్ నరసింహ  సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ మట్టా ప్రసాద్ తో కలిసి వార్డులోని పలు వీధుల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనుల తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ... పట్టణంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, డ్రైనేజీల్లో పూడిక తీత పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మట్టా ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ నరసింహ. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.