29 August, 2026 | 8:50 PM

Breaking News

జూనియర్ జడ్జికి ఘన సన్మానం

14-05-2026 12:00 AM

ముషీరాబాద్, మే13 (విజయక్రాంతి): జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ 2015-16 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారిని స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి బుధవారం పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా ప్రిన్సిపాల్ పి.స్వర్ణలతతో కలసి ఘనంగా సన్మానించారు.

రత్నకుమారి జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులై ప్రస్తుతం రామన్నపేట భువనగిరి యాదగిరి జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. తన ఎదుగుదలకు దోహదపడిన పాఠశాలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని రత్నకుమారి తెలిపారు. ఉపాధ్యాయులు కృష్ణవేణి, మనీష్ తదితరులు జడ్జి రత్నకుమారికి శుభాకాంక్షలు తెలిపారు.