సవరణ ఉంటే సరి చేసుకోండి
29-08-2026 08:42 PM
రాజాపూర్: సవరణ ప్రక్రియ సర్ లో ఓటరు పేరు కానీ, తండ్రి పేరు గాని, చిరునామా లేదా ఇతర వివరములు ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాలని తహసిల్దార్ రాధాకృష్ణ అన్నారు. శనివారం రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు ఓటరు నమోదుకు తగిన పత్రాలు బిఎల్వోలోకి అందించి మళ్లీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ మంజుల, గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్, మంజుల పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్ డిప్యూటీ సర్పంచ్ రామ్ చందర్ జీపివో శివ లింగం బీల్ఓలు శ్యమల లలిత వార్డ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి రహిమత్ సత్యనారాయణ,నర్సిములు, చంద్రయ్య రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.






