29 August, 2026 | 9:22 PM

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్

29-08-2026 08:39 PM

ఎల్లారెడ్డి(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కని కోరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రభుత్వ భవనాలు కానీ రహదారులు కానీ ఇతరేతర అభివృద్ధి పనుల కోసం సుమారు వంద కోట్ల రూపాయల నిధులు అవసరము ఉన్నాయని తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  సీతక్కను హైదరాబాదులోని మంత్రి కార్యాలయంలో నేరుగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల మంజూరు పలు కీలక అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను నేరుగా ఎమ్మెల్యే మదన్మోహన్ మంత్రికి అందజేశారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, రామారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో అర్ధాంతరంగా ఆగిన వంతెన నిర్మాణాలు, రహదారులు బిటి రోడ్లు ఐటిఐ కళాశాల భవనం ఏటీసీ సెంటర్ స్పోర్ట్స్ స్టేడియం గోదాములు నిర్మాణం నాగిరెడ్డిపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయ భవనం ఎల్లారెడ్డి మండలంలోని ఎంపీడీవో ఎంఆర్ఓ కార్యాలయాలు పలు భవనాలు అభివృద్ధి కోసం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయం ఉంటుందని అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని మంత్రిని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరగా సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగవంతంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మదన్మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు.