14 May, 2026 | 5:13 AM

సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి

14-05-2026 12:00 AM

నాచారం సీఐ ధనుంజయ్ గౌడ్ 

ఉప్పల్, మే 13 (విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని కేటుగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాచారం ఇన్స్‌పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. మల్లాపూర్ గోకుల్‌నగర్‌లోని సైబర్ నేరాలపై సబ్ ఇన్స్‌పెక్టర్ వెంకటయ్యతో కలిసి కాలనీవాసులతో అవగాహన సదస్సును ఆయన ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ, సోషల్ మీడియా, హాకింగ్ వంటి పద్ధతి ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని అపరిచిత  వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్, మెసేజెస్ లింక్స్‌ను ఎవరు నమ్మవద్దని సూచించారు.

వృద్ధులనే టార్గెట్ చేస్తున్న నేరగాళ్లు వారి బ్యాంకులో ఉన్న నగదు తస్కరించేందుకు ఓటీపీల పేర్లతో ఫోన్‌కాల్ చేస్తూ ఉంటారని ఇవేవీ కూడా నమ్మకుండా జాగ్రత్త వహించాలని ఆయనకు సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు