షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని అంకంపాలెం సీయోను ప్రార్థనా మందిరంలో షాలేము బహుజన మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన నెలవారీ సమావేశానికి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సమాజంలో శాంతి సేవా భావం సోదరభావం పెంపొందించడంలో పాస్టర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో పాటు సామాజిక సేవలోనూ పాస్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం సంఘంలో గౌరవ సలహాదారుగా కొనసాగుతున్న నిరీక్షణ రావు ఆర్ధిక ప్రోత్సాహంతో మండల పరిధిలోని పాస్టర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన వస్త్రాలు, హెల్మెట్లు, ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల షాలేము బహుజన కమిటీ పాస్టర్లు, అంకంపాలెం సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి, హైకోర్టు అడ్వకేట్ పెనుబల్లి రమేష్ బాబు, సంఘ పెద్దలు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.






