calender_icon.png 4 February, 2026 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ లక్ష్మీ నoబులాద్రి స్వామి రథోత్సవం

03-02-2026 02:39:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని(Sultanabad Mandal) దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నoబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవాన్ని పూజారులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబలి, పుష్పయాగం ,ఏకాంత సేవ , చక్రతీర్థం తోపాటు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

దేవునిపల్లి ,కోదురుపాక గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై క్యూలైన్ ద్వారా మొక్కలు  చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల కుమారస్వామి, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అట్లా శ్రీనివాస్, ఉపసర్పంచులు. వాన రాసి వీరస్వామి, తిరుపతిరావు, డైరెక్టర్లు. సాగర్, బాలకృష్ణ, సతీష్, కుమార్, గోపాలరావు, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రావు, మురళీధర్ రావు లతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.