26 June, 2026 | 10:40 PM

లండన్ లో తలమడ్ల యువకుని అనుమానాస్పద మృతి

26-06-2026 09:32 PM

మిత్రుని బర్త్డే కార్యక్రమంలో పాల్గొని అక్కడే నిద్రించిన శ్రీనాథ్ రెడ్డి

కామారెడ్డి జిల్లా తలమడ్ల నివాసి

ఎమ్మెస్ చదివెందుకు వెళ్లి మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆందోళన 

శవాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించాలని వేడుకలు

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎన్నో ఆశలతో లండన్ వెళ్లిన యువకు డు అనుమానాస్పస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు తమ కొడుకు లండన్ లో  ఎమ్మెస్ చదివి మంచి ఉద్యోగాన్ని సాధించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రులకు ఊహించని శ్లోకాన్ని మిగిల్చి వెళ్లాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసానీ శ్రీనాథ్ రెడ్డి(25) గత 14 నెలల క్రితం లండన్ లో ఎమ్మెస్ చేసేందుకు వెళ్లాడు.

లండన్ లోని  లీ సేస్టర్ పట్టణంలోని యూనివర్సిటీలో ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం శ్రీనాథ్ రెడ్డి తన మిత్రుని బర్త్డే ఉండడంతో అతని రూమ్ కి వెళ్ళాడు. బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనాథ్ రెడ్డి అక్కడే మిత్రుని రూంలో నిద్రించాడు. ఉదయం స్నేహితుడు వచ్చి చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి విగత జివిగా ఉన్నాడు. వెంటనే అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి ని ఉన్నత చదువుల కోసం లండన్ పంపించారు.

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తాడని తల్లిదండ్రులు ఆశించారు. అయితే తల్లిదండ్రుల ఆశలు నీరు గార్చారు. కనీసం తమతో లేకుండా తను వు చాలించడంతో తల్లిదండ్రుల రోధన లు గ్రామస్తులను కంటి తడి పెట్టించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ కానరాని లోకాలకు పోవడం జీర్ణించుకోలేక తల్లిదండ్రులు దుఃఖంతో ఏకరువు పెట్టారు.

రాజంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనాథ్ రెడ్డి శవాన్ని స్వగ్రామానికి పంపించేలా అక్కడ ఉన్న మిత్రులు కృషి చేస్తున్నట్లు సమాచారం. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో హత్యకు గురయ్యాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణం లో అక్కడి పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. స్వదేశానికి శ్రీనాథ్ రెడ్డి మృత దేహం రావడానికి వారం రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.