03-02-2026 02:37:56 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని రామక్కపల్లి గ్రామానికి చెందిన కట్ట లక్ష్మమ్మ,కట్ట బాలయ్యలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసినట్లు అచ్చయపల్లి గ్రామ సర్పంచ్ బెస్త సాయిలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ బెస్త సాయిలు మాట్లాడుతూ....పేద ప్రజలను ఆపదలో ఆదుకునేందుకే స్థానిక ఎమ్మెల్యే మదర్ మోహన్ రావు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 34000, 20000 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.గ్రామంలో ఇంకెవరైనా నిరుపేదలు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఎక్కువ బిల్లులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటే తెలియజేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.