కేజీబీవీ సందర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
27-06-2026 12:46 AM
ఆత్మకూరు, జూన్ 26: అమరచింత మండలం పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సందర్శించారు. పాఠశాలలోని మౌలిక వసతుల గురించి విద్యార్థినులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థినిల మౌలిక వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.






