ఘనంగా శ్రీ బాలత్రిపుర సుందరీదేవి ఆలయ వార్షికోత్సవం
- హాజరైన గాంధీనగర్ ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ ఎండి అంజద్ అలీ, ఆలయ చైర్మన్, మాజీ కార్పొరేటర్ టి. రవీందర్
- ఆలయ వార్షికోత్సవం సందర్బంగా చండీహోమం, వందలాది మంది భక్తులకు అన్నదానం
ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని అడ్వకేట్స్ కాలనీలో ఉన్న శ్రీ బాల త్రిపురసుందరీ దేవి, పంచముఖ హనుమాన్ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారు జామునుంచే అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలతో పాటు చండీహోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గాంధీగనగర్ సబ్డివిజన్ ఏసీపీ ఎ. యాదగిరి, దోమలగూడ పోలీస్టేషన్ సీఐ ఎండి. అంజద్ ఆలీ, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయ చైర్మన్, మాజీ కార్పొరేటర్ టి. రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ఏసీపీ ఏ యాదగిరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలతో పాటు ఎలాంటి పండగలు జరిగినా మతసామరస్యానికి ప్రతీకగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు.
బాలత్రిపుర సుందరీదేవి ఆలయ కమిటి చైర్మన్ టి. రవీందర్ మాట్లాడుతూ అడ్వకేట్ కాలనీలో ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీదేవి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి11వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, చండీహోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలకు అన్ని విధాలుగా సహకరించిన భక్తులు, దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ11 వ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన అతిధులు. దాతలను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి. వెంకటేష్, టి. కృష్ణమూర్తి, దోమలగూడ హనుమాన్ దేవాలయ చైర్మన్ కేఆర్ కే ప్రసాద్, తాళ్లబస్తీ కమిటి అధ్యక్షుడు ఎ. ప్రభాకర్ గంగపుత్ర, కవాడిగూడ బీజేపీ డివిజన్ అధ్యకుడు సలంద్రి దిలీప్ యాదవ్, పరిమల్ కుమార్, బస్తీ కమిటీ నాయకులు సిహెచ్. శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్ కె శ్రీను, రాజశేఖర్ ముదిరాజ్, వై. శ్రీనివాస్ గౌడ్, ప్రేమ్ కుమార్, బీజేపీ నేతలు బొల్ల రమేష్ బాబు, మహేం దర్ బాబు, పరశురాం, గదైశ్రీను. కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, సుధీర్ భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.






