రామేశ్వరానికి బస్సు సర్వీసు
05-06-2026 04:39 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి రామేశ్వరం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి బయలుదేరి కాణిపాకం, వెళ్లూరు, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాలశెంబ, మధురై, రామేశ్వరం వెళ్లి తిరిగి నిర్మల్ కు బుధవారం చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల నుండి మంచి ఆధారణ లభించిందని, ఈ బస్సు ఆన్ లైన్ లో పెట్టిన మూడు రోజులకే ఫుల్ అయినందున జులై మొదటి వారంలో మరో ట్రిప్ ఇదే రూట్ లో ఉంటుందని డిపోమేనేజర్ తెలిపారు. ఆర్టీసీ యాత్ర బస్సులను ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదలు, మీ ఆదరాబిమానాలు ఎల్లప్పుడూ ఆర్టీసీ మీద ఉంచి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం,సుఖవంతం శుభప్రదం కావాలని కోరారు






