ధాన్యం కొనుగోళ్లు జరపాలి
నర్మెటలో రైతుల రాస్తారోకో
నంగునూరు, జూన్ 10(విజయక్రాంతి): వానకాలం ప్రారంభం అవుతున్న వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. నంగునూరు -సిద్దిపేట ప్రధాన రహదారిపై బుధవారం రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇంకా 20 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరగాల్సి ఉందని, కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు రెండు కిలోలకు పైగా తరుగు తీస్తూ అన్యాయం చేస్తున్నారని, భారీ వర్షాలు పడితే ధాన్యం కొట్టుకుపోయే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ టి.వివేక్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి నిరసన విరమింప జేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోక లను పునరుద్ధరించారు.






