23 April, 2026 | 3:43 AM

కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి

23-04-2026 01:49 AM

బూర్గంపాడు,ఏప్రిల్ 22(విజయక్రాంతి): అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏడిఎ తాతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ మందా నాగరాజు,ఉపసర్పంచ్ వెంకన్న లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. రైతులకు మద్దతు ధరను చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దళారులకు దాన్యం విక్రయించి రైతులు నష్టపోవద్దని సూచించారు.ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కెఆర్ కెవి ప్రసాద్, ఏవో శంకర్,పిఎసిఎస్ సీఈవో ప్రసాద్, స్థానిక నాయకులు భజన సతీష్, రైతులు పాల్గొన్నారు.