7 July, 2026 | 6:20 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు

07-07-2026 04:52 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): వ్యవసాయానికి అవసరమైన సమయంలో రైతులకు యూరియా సకాలంలో అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని, కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన విడతల వారీ యూరియా బుకింగ్ విధానం రైతులకు ఇబ్బం లాదులు కలిగించే అవకాశముందని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామ ఉప సర్పంచ్ దిటి బాలనర్సు అన్నారు. ఎకరానికి రెండు యూరియా బస్తాల పరిమితి విధించడం వల్ల పంటల అవసరాలు పూర్తిగా తీరవని ఆయన పేర్కొన్నారు.

ప్రతి విడతకు 20 రోజుల వ్యవధి ఉండటంతో అవసరమైన సమయంలో ఎరువులు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిబంధనలను పునఃసమీక్షించాలని, సాగు అవసరాలకు అనుగుణంగా అవసరమైన మేర యూరియాను ఒకేసారి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని దిటి బాలనర్సు విజ్ఞప్తి చేశారు.