7 July, 2026 | 4:01 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్   •   భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •  

తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి

23-04-2026 01:48 AM

మోతె, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఒంటరి మహిళను అని చూడకుండా తనను నానా దుర్భాషలాడారని, అవమానించారని ఓ మహిళ తహశీల్దార్‌పై ఫిర్యాదు చేసింది. బుధవారం చెరుకుపల్లి ఉపేంద్ర తహశీల్దార్ ఎం. వెంకన్నపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్‌లోని ప్రభుత్వ జాగాలో సుమారు 20 కుటుంబాలకు చెందిన వారు ఇండ్లు నిర్మాణం చేసు కున్నారని, వారితో పాటు తాను ఒక్క గది నిర్మాణం చేసుకున్నానన్నారు.

విచారణ కో సం వచ్చిన తహశీల్దార్ వివరాలు అడిగారని, తాను చెప్పానన్నారు. అయినా తహశీ ల్దార్ తన నోటికి వచ్చినట్లు పది మందిలో అసభ్యకరంగా తిట్టారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మహిళ విలపించింది. తనను కించపరిచిన తహశీల్దార్ వెంకన్నపై కేసు నమోదు చేయాలని న్యాయం చేయాలని కోరారు. ఎస్‌ఐ అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి తహశీల్దార్‌కు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదని ఎస్‌ఐ అజయ్ కుమార్ తెలిపారు.