30 August, 2026 | 8:24 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన సహాయ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

23-04-2026 01:49 AM

పాలకవీడు, ఏప్రిల్ 22: మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు సహాయ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి యామిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడి పని వివరాలు అడిగి తెలుసుకన్నారు.

గరిష్ట వేతనం 307 రూపాయలు వచ్చే విధంగా కూలీలకు అవగాహన కల్పించాలని సిబ్బందినీ ఆదేశించారు. వేసవికాలంలో ఎండల తీవ్రత అధికమవుతున్న సందర్భంగా రెండు సార్లు ఫోటో హాజరు తప్పని సరి అయినందున ఉదయమునే ఏడు గంటలలోపు పని ప్రదేశంలోకి వచ్చి 11 గంటల వరకు పని పూర్తి చేసుకోవాలని కూలీలకు సూచించారు.

అలాగే కూలిలకు పని ప్రదేశంలో కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయమని పంచాయతీ కార్యదర్శి వినయ్ ని ఆదేశించారు. తదుపరి గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించి తగు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.లక్ష్మి, అదనపు కార్యక్రమ అధికారి రాజు, పంచాయతీ కార్యదర్శులు వినయ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.