ఎస్టీయుటీఎస్ సభ్యత్వ నమోదు
07-07-2026 04:43 PM
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్టీయుటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని నిర్మల్ , తానూర్ బైంసా పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుండి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఎస్టీయుటీఎస్ విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఉపాధ్యాయులు ఉన్నారు.






