27 February, 2026 | 3:07 AM

జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

27-02-2026 01:03 AM
  1. ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

ఇండస్ట్రియల్ పార్క్, చనాకా- బ్యారేజ్‌పై ఏరియల్ సర్వే

ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి లతో కలిసి బోరజ్ మండలం హాత్తిఘాట్ లోని చనాకా-కోరాట బ్యారేజ్ పంప్ హౌస్‌కు చేరుకున్నారు.

నంతరం ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్,  టీజీఐఐసీ ఎండీ శశాంక, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ అఖిల్ మహాజన్‌లతో కలిసి భీంపూర్, బోరజ్ మండలాల పరిధిలో గల హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ఏరియల్ సర్వే చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర వివరాలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఫోటో ప్రదర్శన ద్వారా మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చనాకా-కోరాట బ్యారేజ్ ద్వారా చేకూరే సాగునీటి ప్రయోజనాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేసమన్నారు.

ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష సతీష్, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, విద్యుత్ శాఖ ఎస్.ఈ శేషరావ్ రాథోడ్, ఆర్డీఓ స్రవంతి, తహసిల్దార్లు శ్రీనివాస్,రాజేశ్వరి, నలందప్రియ, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, అడ్డీ బోజా రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.