17-02-2026 09:51:06 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం,ఉమ్మడి బెజ్జుర్ మండలపరిధిలోని ఆదివాసీ గ్రామాలపై కన్నెర్రా చేస్తున్న ప్రభుత్వాలు,అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆదివాసీ లు మారుమూల ప్రాంతాల్లో అటవీని నమ్ముకొని సంచార జీవిగా జీవిస్తున్న ఆదివాసులు కనీసం విద్య వైద్యం, రోడ్లు సౌకర్యాలు లేక జీవనోపాధి గడుపుచున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఆదివాసులకు సౌకర్యాలు కల్పించకుండా, ఆదివాసీ హక్కులను కాలారస్తు, అభివృద్ధి ని అడ్డుకొనుచున్న పారెస్ట్ అధికారులను, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వాలు గత సంవత్సరాలనుండి ఎన్నో ఇబ్బందులు ఆదివాసులకు పారెస్ట్ అధికారులు పెట్టిన పట్టించు కోవడం లేదని సీపీఎం నాయకుడు నైతం రాజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత సంవత్సరాలనుండి రోడ్లు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆదివాసులు ప్రభుత్వాలతో, అధికారులతో మోరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు, ఒక పక్కా పారెస్ట్ అధికారులు ఆదివాసులసాగు చేస్తున్న భూములపై, నివాసంకోసం నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పై, గ్రామాలలో అభివృద్ధి పనులు, రోడ్లు మరమ్మత్తులు,ఆదివాసీ గ్రామాలలో అభివృద్ధి పనులు చేయకుండా పారెస్ట్ అధికారులు అడ్డుకొనుచున్నారు.
ఉమ్మడి బెజ్జూర్ మండలం సోమిని, జిల్లెడా, మోర్లిగూడ, నందిగామ, గుండేపల్లి, తలయి, కమ్మర్గం, అగరగూడ తదితరుగ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు నైతం రాజు ఆరోపించారు. వర్షాకాలంలో గ్రామానికి రాలేని పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.