27 July, 2026 | 2:50 AM

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

27-07-2026 12:00 AM

పెద్దపల్లి, జూలై 26 (విజయ క్రాంతి)పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పా టు చేసిన విశాల్ మార్ట్ షా పింగ్ మాల్ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదివా రం ఘనంగా ప్రారంభించా రు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి మార్ట్ను ప్రారంభించిన ఆయన, అనంతరం షాపింగ్ మాల్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సంద ర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యానికి ప్రభుత్వ విప్ విజయరమణ రావు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభివృద్ధికి సంకేతమని అన్నారు.

ఇలాంటి సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వస్తువులు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అంతకుముందు విశాల్ మార్ట్ యాజమాన్యం ప్రభుత్వ విప్ విజయరమణ రావుకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాం గ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.