రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు...
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
పెబ్బేరు ఏప్రిల్ 8: రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ...రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. పెబ్బేరు చుట్టూ పక్కల పరిధిలో మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను సంప్రదించి పెబ్బేరులో మొదటిసారి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు రూ. 2400 మంచి మద్దతు ధర కల్పిస్తోందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం,పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




