26 August, 2026 | 2:30 AM

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

25-08-2026 09:52 PM

భైంసా(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. మంగళవారం నిర్మల్ బైంసా టీజీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ బస్ డ్రైవర్లు 45 మంది ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత, కనీస పెన్షన్, గ్రాట్యుటీ, సెలవులు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్‌ఎన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎం.డీ ఫయాజ్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ఔట్సోర్సింగ్ డ్రైవర్ల యూనియన్ నాయకులు సాయినాథ్, స్వామి, శ్రీనివాస్, దర్బార్ సింగ్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.