మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
25-08-2026 09:54 PM
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
జిల్లా పోలీస్ కార్యాలయంలో వనమహోత్సవం
భూపాలపల్లి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీతో పాటు డీఎఫ్‌ఓ కిష్ట గౌడ్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, గౌడ్ కమిషనర్ ఉదయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంపుతో భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఆర్‌ఐలు రత్నం, సంతోష్ కుమార్, పూర్ణచందర్, కాశీరాం, అటవీశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






