25 August, 2026 | 10:49 PM

బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ ను యధావిధిగా కొనసాగించాలి.

25-08-2026 09:50 PM

తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం ఆధ్వర్యంలో సంఘీభావం

తుంగతుర్తి (విజయ క్రాంతి): హైదరాబాదు నుండి సూర్యాపేట మీదుగా విజయవాడకు నిర్మాణం తలపెట్టిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ ను యధావిధిగా  కొనసాగించాలని కోరుతూ, మంగళవారం సాయంత్రం మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న ఆధ్వర్యంలో ,సూర్యాపేటలో గడిచిన పది రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నాయకులకు పూర్తి మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే, సూర్యాపేట జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించి, వ్యాపారస్తులు వ్యాపార రంగంలో రాణించుటకు, బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ  రాజకీయ వైస్ చైర్మన్ తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్, కోశాధికారి మాసెట్టి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ ,తల్లాడ కేదారి, బండారు. రామచంద్రయ్య, గుమ్మడవెల్లి శ్రీనివాస్, తల్లాడ నారాయణ, తల్లాడ శ్రీహరి, తల్లాడ శ్రీను, తల్లాడ బిక్షం, కాసం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.