ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పా టు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పే ర్కొన్నారు. భారీ అవినీతి జ రిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. వాటిని చట్టపరంగా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నా రు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టపరమైన ప్రమాణా లకు అనుగుణంగా తగిన ఆధారాలను సమ ర్పిం చలేకపోవడం వల్ల, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కాం గ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపితమైందన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు.
అధికారంలోకి రా గానే.. కేసీఆర్, కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయం లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు... కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవక తవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి, ఫార్ములా వన్ రేస్ పేరుతో జరిగిన ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూ ఆక్రమణలు, భూకేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. అవినీతి సొమ్మును కక్కిస్తానని పదే పదే సీఎం ప్రకటించినప్పటికీ వాటిపై ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడానికి కారణం.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తీ యే అన్నారు.
గత రెండున్నరేళ్లు గా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటోంది కాబట్టే. బీఆర్‌ఎస్ హ యాంలో జరిగిన అక్రమాలపై చర్యలకు వెనుకాడుతోందన్నారు. హైకోర్టు తీర్పు నేప థ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని, దొంగలు, దొంగలు కలిసి దోచుకోవడంలో పోటీపడుతూ.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.






