23 April, 2026 | 3:22 AM

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కృష్ణవేణి హవా

23-04-2026 02:04 AM

అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో ఏ.శిశిర్ సాయి 1355, ఈ.హర్షిత్ 3311, వీఎస్‌ఎస్ లక్ష్మి4513, ఏ మోక్షిత సాయి 5144 వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు.

రిజర్వేషన్ కేటగిరి విధానంలో డి.అలేఖ్య 41, కె.స్టాన్లీ చరణ్ 59, టి.సంతోష్‌కుమార్ 360, వీఎస్‌ఎస్ లక్ష్మి 529, సీహెచ్ శైలజ 559, ఏ.మోక్షిత సాయి 609, బి.సంతోష్ 1259, ఎ.చరణ్ 1891, బి.కార్తీక్ 2016, జె.అఖిల్ 2803, ఏ.గణేష్ 3059, బి.సింధు 3362, జె.చరణ్‌తేజ్ 3598, ఎం చైతన్య లహరి 3659, ఎం.వెంకటేశ్వర్లు 4022, డి.రామాద్రి 4529, బి.అరవింద్ 5535, బి.సిద్దు 5674, హెచ్ జగదీష్ 5958 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏవో నిరంజన్‌కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.