7 August, 2026 | 9:48 PM

గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

07-08-2026 08:45 PM

- ప్రభుత్వ విప్ వేముల వీరేశం 

కట్టంగూర్,(విజయక్రాంతి): కేతపల్లి గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు శుక్రవారం కేతపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై  సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.

గ్రామ పంచాయతీలు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పచ్చదనం, గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీలకు కేటాయించిన నిధులను పారదర్శకంగా వినియోగించి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.