అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
07-08-2026 08:43 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డ్ స్వప్న కాలనీ,జవహర్ నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లి పాల వారోత్సవాల సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 12 వ కౌన్సిలర్ అమిరిశెట్టి శ్రావణీ-రాకేష్ , అంగన్వాడీ స్కూల్ టీచర్స్ అమిరిశెట్టి మేఘమాల, నరహరి, స్వాతి , పిల్లల తల్లులు పాల్గొన్నారు.






