5 August, 2026 | 2:45 AM

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

05-08-2026 01:55 AM

నాగల్గిద్ద, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : నాగల్గిద్ద మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హామీల అమలు కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్గే రాజు, ఉపసర్పంచ్ పండరీనాథ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రావు పాటిల్, సర్పంచులు గుండెరావు పాటిల్, శివశరణప్ప, అనిల్ పాటిల్, అశోక్ చౌహాన్, రాథోడ్ సంతోష్, సంతోష్, మారుతి, లక్ష్మణ్, అబ్దుల్ రహీం, నారాయణ జాదవ్, శరణప్ప, మాజీ ఎంపీటీసీ నర్సప్ప, రవి, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.