30 May, 2026 | 4:32 AM

గౌడ విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి

30-05-2026 12:05 AM

గౌడ విద్యార్థులను సన్మానించి మేమేంటోల అందజేత

కామారెడ్డి, మే 29 (విజయక్రాంతి): గౌడ సమాజ అభ్యున్నతికి విద్య ప్రధాన ఆయుధమని, గౌడ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జై గౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డి కర్ష బీ ఈడీ కళాశాలలో నిర్వహించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నేటి యువత విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకుంటేనే గౌడ సమాజానికి గౌరవం పెరుగుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నత పదవులు సాధించాలని సూచించారు.

గౌడ సమాజంలో ప్రతి కుటుంబం తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువా మే మెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్తలు గౌడ కుల చరిత్ర గొప్పదనం సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించారు. కౌండిన్య మహర్షి మహత్యం గౌడ కులదేవతల వైభవం వీర శూరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు సమాధి సేవలను స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ముఖ్యంగా విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రుల కృషిని ఆయన కొనియాడారు. జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాది నారాయణ గౌడ్, అధికార ప్రతినిధి దత్తాత్రి గౌడ్, యూత్ అధ్యక్షుడు క్రాంతికుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యూత్  విభాగం అధ్యక్షులు బొమ్మగోని శంకర్ గౌడ్, కేశవ్ గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, ఇందూరి సిద్ధ గౌడ్, కర్రోళ్ల శేఖర్ గౌడ్, బొంబోతుల నరేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రామా గౌడ్, సురేష్ గౌడ్, దేవేందర్ గౌడ్, విద్యార్థు లు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.