30 May, 2026 | 5:26 AM

పోలీస్ కళాబృందం ద్వారా ప్రయాణికులకు అవగాహన

30-05-2026 12:03 AM

కామారెడ్డి, మే 29 (విజయక్రాంతి): కామారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో శుక్రవారం ప్రయాణికులకు జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళా జాత బృందం పలు అంశాలపై అవగాహన కల్పించారు.దొంగతనాలు జరుగకుండా జాగ్రత్తలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సైబర్ నేరాలపై అవగాహన,హెల్మెట్ ఉపయోగంపై, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని కళాబృందం బృందం ప్రతినిధులు ఆట పాటలతో గేయాలతో ప్రయాణికులకు వివరించారు. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930, ఓటిపి లుఎవరికీ చెప్పవద్దని తెలిపారు.  అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని మహిళలకు రక్షణగా షి టీమ్ ఉంది అని తెలిపారు.

షి టీమ్ టోల్ ఫ్రీ నం:8712686094 కు ఫోన్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని, వేసవి కాలంలో దొంగ తనాలపై తగు జాగ్రతలు తీసుకువాలని, చిన్న పిల్లలు సెలవుల సందర్బంగా ఈతలకు పోయి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి.పోలీస్ కానిస్టేబుల్స్, ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా  కార్యక్రమం నిర్వహించారు.కామారెడ్డి షీ టీమ్ సభ్యులు, మహిళా కానిస్టేబుల్ సౌజన్య, కానిస్టేబుల్ భూమయ్య, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పాల్గొన్నారు.