30 May, 2026 | 3:49 AM

రాష్ట్రంలో మరోసారి రేవంత్ సర్కారే..

30-05-2026 12:05 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, మే 29 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో చొ ప్పదండి నియోజకవర్గం, కరీంనగర్ కార్పొరేషన్ ముఖ్య నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

ఈ సమావేశాలకు మాజీ ఎమ్మె ల్యే, కరీంనగర్ పార్లమెంటు పిసిసి సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఎస్‌ఐఆర్ ఓటర్ మ్యాపింగ్ పై అవగాహన, బిఎల్‌ఎ-2ల నియామకం, సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీల పనితీరు, బూత్ స్థాయి బలోపేతంపై మండల, పట్టణ డివిజన్ కాం గ్రెస్ అధ్యక్షులకు అనుబంధ సంఘాల అధ్యక్షులకు నాయకులకు నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని, ఏ ఒక్క ఓటరును కూడా తొలగించకుండా 18 సంవత్సరాలు నిండిన యువకులను కొత్త ఓటర్లుగా చేర్పించే ప్రక్రియలో భాగస్వాములు కావాలని అన్నారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ ను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటర్లను తొలగించే ప్రక్రియ చేపడుతుందని దానిపై ప్రతి పౌరునికి అవగాహన అవసరమని అన్నారు.

ఈ సమావేశాలలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్, పిసిసి ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, బానోతు శ్రవణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, పురం రాజేశం, వెన్నం రజిత రెడ్డి, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జవ్వాజి హరీష్, సువిన్ యాదవ్, మహేందర్ మంత్రి, తదితరులు తెలిపారు.