17-02-2026 01:08:29 AM
చైర్ పర్సన్‌గా భార్య, వైస్ చైర్మన్‌గా భర్త
నిర్మల్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ నూతన పాలకవర్గంలో నూతన ఘట్టం ఆవిష్కరించింది. సోమవారం చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్‌గా కావ్య భర్త గణేష్ చక్రవర్తి ఎన్నికయ్యారు. నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉండగా కాంగ్రెస్ 24 వార్డుల్లో విజయం సాధించింది.
మొదట చైర్‌పర్సన్ అభ్యర్థిగా అప్పల కావ్యను ప్రకటించినప్పటికీ వైస్ చైర్మన్‌గా మైనార్టీకి చెందిన వారికి అవకాశం ఉంటుందని అందరూ భావించారు. అయితే కౌన్సిలర్లు అందరూ అప్పల గణేష్ చక్రవర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే కుటుంబం చెందిన అప్పల అనురాధ 2005లో చైర్ పర్సన్‌గా ఎన్నికవగా, వీరి తాత అప్పల నరసయ్య 1981 లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు.