7 July, 2026 | 10:17 PM

కాషాయ మయం అయిన నల్లగొండ

07-07-2026 09:10 PM

నల్లగొండ,(విజయక్రాంతి):  జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఎబివిపి నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఎబివిపి జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి రాజ్ హాజరై మాట్లాడుతూ... దేశ నిర్మాణంలో ఎబివిపి ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుందని 5 మంది విద్యార్థులతో దేశవ్యాప్తంగా 78 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచములోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని అన్నారు. జాతీయవాదం పెంపొందడానికి ప్రాణాలను కూడా లెక్కచేయని మహా వీరులు పుట్టిన  నల్గొండ గడ్డపై  దేశభక్తిని విద్యార్థుల్లో పెంపొందేలా చేసిన ఏచూరి శ్రీనివాస్ కి నివాళులు అర్పిస్తున్నామని ఆయన కృషి వల్లే జాతీయవాదం ప్రతి విద్యార్థి మదిలో విస్తరించిందని అన్నారు.

భారతదేశంను ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిలుపుటకు ఎబివిపి 78 సంవత్సరాలుగా  చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ, ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, నరేష్ తేజ, జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య,ఎబివిపి రాష్ట్ర యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనేష్,  రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ సంపత్, గోపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, అమల, జయందర్, కార్తీక్, పల్లవి, పరమేష్, శివ, వరుణ్, సిద్దు, చరణ్,నవీన్, గణేష్  తదితరులు పాల్గొన్నారు.