29 August, 2026 | 12:37 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

07-07-2026 09:00 PM

* ఇరు వర్గాలపై బైండవరి కేసు నమోదు: సీఐ చరమంద రాజు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హుజూర్నగర్ సిఐ చరమందరాజు అన్నారు. గరిడేపల్లి లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కేంద్రమైన గరిడేపల్లి లోని దాబాలో సోమవారం ఘర్షణ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరితోపాటు దాబా హోటల్ యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గొడవ పడిన ఇరు వర్గాలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా గుంపులుగా చేరి గొడవలకు కారణమైతే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్ఐ బి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.