7 July, 2026 | 10:19 PM

గోవింద్‌పూర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు అభినందించిన డీఎస్పీ

07-07-2026 08:57 PM

జహీరాబాద్,(విజయక్రాంతి): గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ అన్నారు మంగళవారం నాడు జహీరాబాద్ మండలము గోవింద్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ద్వారా మూడు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి సైదా నాయక్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి దొంగతనాలు భద్రత నేరాల నివారణ శాంతిభద్ర పరిరక్షణ ఆధునిక భద్రత వ్యవస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించబడింది.

మూడు లక్షల రూపాయల తో 16 సీసీ కెమెరాలు గ్రామంలోని వివిధ క్రీడలలో ఏర్పాటు చేశారన్నారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ కవిత వెంకట్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ సిఐ శివలింగం చిరాగ్ పల్లి ఎస్ఐ వినయ్ కుమార్, గోవింద్పూర్ సర్పంచ్ కవిత వెంకట్ ,మాజీ సర్పంచ్ తాజుద్దీన్ , రాజు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు నడిపే 30 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మొక్కలు నాటి ప్రతి ఒక్కరు కూడా తమ ఇండ్ల వద్ద మొక్కలు నాటుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని డిఎస్పీ సైదా నాయక్ పేర్కొన్నారు.