8 July, 2026 | 1:12 AM

యువకుడి మృతికి కారకులను అరెస్టు చేయాలి

08-07-2026 12:11 AM

తాండూరు, జూలై 7,(విజయక్రాంతి) వి కారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన గాండ్ల శివకుమార్ అనే యువకుడి మృతికి అదే గ్రామానికి చెందిన  రాణి రెడ్డి ప్రధాన కారణమని ఆమెను అరెస్టు చేసి బాధిత  కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివా స్, మాజీ ఎంపిటిసి వెంకట్, యువ నాయకులు బాలరాజ్ ప్రజా సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు.

మంగళవారం శివకుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ మృతి రోజు చివరిసారిగా రాణి రెడ్డి మహిళతో చేసిన వాట్సప్ చాటింగ్, తదితర సాం కేతిక ఆధారాలతో ఆమెను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. మృతువి భార్య చంద్రకళ సైతం రాణి రెడ్డి పై తగు చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.