29 July, 2026 | 9:14 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం

02-06-2026 12:02 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

రామచంద్రాపురం, జూన్ 1: అమీన్పూ ర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల అయ్యాయని.. ప్రతి పార్కుని ప్ర జల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహి పాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్కు, హుడా కాలనీ పార్కు 2  కాలనీలలో ఒక కోటి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో నూత న పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజల ఆరో గ్యం, ఆహ్లాదానికి దోహదపడుతుందని తెలిపారు.

పార్కులు పచ్చదనాన్ని పెంపొం దించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణంలో నడక, వ్యాయామం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం తహసిల్దార్ సరస్వతి, పటాన్చెరు స ర్కిల్ డిప్యూటీ కమిషన్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలిత సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రా ములు గౌడ్, డీఈ కృష్ణవేణి, యుబిడి మేనేజర్ విక్రమ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకు లు దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.