04-02-2026 12:00:00 AM
వెండి రూ.20వేలు, పసిడి రూ.6 వేలు పెరుగుదల
హైదరాబాద్‌లో తులం పసిడి రూ.1.56 లక్షలు, కిలో వెండి 2.74 లక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 3: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొన్నిరోజులుగా ధరలు ఆకాశాన్నంటాయి. మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడ్‌కు కొత్త చైర్మన్ నియామకం, సీఎంఈ మార్జిన్ పెంచడం, గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విలువైన ఈ ధరలు పతనమవుతూ వచ్చి, తాజాగా మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం మధ్యాహ్నం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.56 లక్షలు పలికింది. సోమవారం నాటి ధరతో పోలిస్తే రూ.6 వేలు పెరిగింది. కిలో వెండి ధర రూ.2.74 లక్షలు పలికింది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.20 వేలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 85.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.