calender_icon.png 5 February, 2026 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో

05-02-2026 01:50:49 AM

పునరుత్పాదక శక్తి రంగానికి మహా వేదిక

ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో తెలంగాణ 2026ను ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వ హించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు 10 వేల మందికి పైగా సందర్శకులు హాజరుకానున్నట్లు అంచనా. దీంతో ఇది దక్షిణ భారతదేశంలో సోలార్ రంగానికి సంబంధించిన అతిపెద్ద సమావేశంగా నిలవనుంది. ఈవెంట్ పోస్టర్‌ను ప్రెస్ క్లబ్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో ఫౌండర్, సి.ఎం.డి ఆనంద్ గుప్త బుధవారం ఆవిష్కరించారు. గ్లోబల్ సోలార్ ఎక్స్పో తెలంగాణ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, ఇది సోలార్ రంగంలో పాలసీ, వ్యాపారం, సాంకేతికతల సమ్మేళనం అన్నారు.

సోలార్ ప్రదర్శన, సూర్యాకాన్ కాన్ఫరెన్స్, తెలంగాణ సోలార్ అవార్డులు, బయ్యర్‌సెల్లర్ మీట్ వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. తెలంగాణ పునరుత్పాదక శక్తి రంగానికి చెం దిన ప్రముఖ ప్రభుత్వాధికారులు పాల్గొననున్నారు. నవీన్ మిట్టల్, ప్రత్యేక ప్రధాన కార్య దర్శి, తెలంగాణ ప్రభుత్వం, వి. రామచందర్, కమిషన్ సెక్రటరీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేట రీ కమిషన్, వీ శివాజీ, డైరెక్టర్ ప్రాజెకట్స్, మాస్టర్ ప్లాన్, ఐటీ, హెచ్‌ఆర్డీ, నరసింహు లు, డైరెక్టర్, శ్రీ ముషర్రఫ్ ఫారూఖీ, ఐఏఎస్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టీజీపీడీసీ ఎల్, ఇర్‌వీ అనిల, వైస్‌చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, టీజీఆర్‌ఈడీసీవో పాల్గొన్నారు.