8 July, 2026 | 8:23 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

జీ రాం జీ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బచావో

05-02-2026 01:52 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): అఖిల భారత అసంఘటిత కార్మికు లు, ఉద్యోగుల కాంగ్రెస్ జాతీయ చైర్మన్ డా.ఉదిత్ రాజ్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ (ఉపాధి హామీ) పధకం పేరు మార్పు, ఉపాధి హామీ కార్మికుల హక్కులపై దాడి చేసే విధంగా రూపొందించిన జి రామ్ జి బిల్లును వ్యతిరేకిస్తూ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ బచావ్ సంగ్రమ కార్యక్రమం చేపడుతున్నట్లు కేకేసి తెలంగాణ చైర్మన్ కౌశల్ సమీర్ తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి పొట్టకొట్టే విదంగా తీసుకొచ్చిన జి రామ్ జి పథకాన్ని నిరసిస్తూ చేపట్టనున్న సంతకాల సేకరణ కరపత్రం, వాల్ పోస్టర్ ను టీపీసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆవిష్కరించారని బుధవారం ఒక ప్రకటనలో అయన తెలిపారు. కేకేసి నేషనల్ వైస్ చైర్మన్ డా. నవాబ్ షేక్ ఇబ్రహీం, నేషనల్ కో-ఆర్డినేటర్లు ఎన్.విజయ్ కుమార్, వేణు స్వామ తదితరులు ఉన్నారు.