30 May, 2026 | 10:13 PM

Breaking News

పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •   పొగాకు ఆరోగ్యానికి హానికరం   •   అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు   •   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •  

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష

30-05-2026 09:39 PM

వెల్దండ: మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు దీక్షకు దిగింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన మురళీకృష్ణలిద్దరూ గత రెండేళ్లుగా సన్నిహితంగా మెలిగారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించినట్లు యువతి ఆరోపిస్తోంది. ఇటీవల పెళ్లి విషయమై యువతి ఒత్తిడి చేయగా మురళీకృష్ణ నిరాకరించడంతో శనివారం మురళీకృష్ణ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది.